గొంతు
ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు. సరయిన మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగు పరచండి. ఈ విషయమై చర్చించేందుకు చర్చా పేజీని చూడండి. |
గొంతు, గొంతుక, కంఠము లేక గళం ముక్కు, నోరులకు వెనుక భాగంలో స్వరపేటిక, అన్నవాహిక లకు పైనున్న భాగం. ఇది జీర్ణ వ్యవస్థ, శ్వాస వ్యవస్థలకు రెండింటికి చెందుతుంది. ఆహారం అన్నవాహికలోనికి, గాలి ఊపిరితిత్తులలోనికి ఒకదానితో ఒకటి కలవకుండా దీని ద్వారా వెళ్తాయి[1][2].గొంతు లేక గళంలో మూడు భాగాలు ఉంటాయి. ముక్కు వెనుకను, మృదుతాలువునకు పైనా ఉండు గొంతుభాగం నాసికాగళం[3]. నాసికాగళంలోనికి రెండు ప్రక్కలా శ్రవణకంఠ నాళికల ద్వారాలు తెరుచుకుంటాయి. ఈ శ్రవణకంఠ నాళికలు మధ్యచెవులను గొంతుతో కలుపుతాయి. నాసికాగళం ముందు భాగంలో ముక్కు వెనుక రంధ్రాలు తెరుచుకుంటాయి. వెనుక భాగంలో శ్లేష్మపు పొర క్రింద దళసరి రసికణజాల రాశులు ఉంటాయి.నోటి వెనుక ఉండు గొంతు భాగం వక్త్రగళం[3]. ఈ భాగం అంగిలి నుంచి కంఠికాస్థి ( హయాయిడ్ ఎముక ) వరకు ఉండే గళభాగం. మృదుతాలువు నుంచి రెండు పక్కలా నాలుక మూలానికి ఒకటి, గళంకు ఒకటి తెరలు క్రిందకు దిగుతాయి. ఈ తెరల నడిమిలో గళ రసికణ గుళికలు ( టాన్సిల్స్ ) ఉంటాయి. మృదుతాలువు మధ్యభాగం నుంచి కొండనాలుక ( ఉపజిహ్వ ) గొంతులోనికి వ్రేలాడుతుంది[4]. కంఠికాస్థి నుంచి అన్ననాళ ప్రవేశద్వారం వరకు ఉండు గొంతు భాగము అధోగళం[3]. దీనిలో ముందుభాగంలో స్వరపేటిక ఉంటుంది. స్వరపేటికకు మీద నాలుక మూలంలో స్వరపేటిక మూత ఉంటుంది. ఆహారాన్ని శ్వాసపథంనుంచి తప్పించి అన్ననాళంవైపు మరలించుటకు ఈ స్వరపేటిక మూత తోడ్పడుతుంది. స్వరపేటికకు ఇరుప్రక్కల కాయల ఆకారపు గుంతలు ఉంటాయి[4]. గొంతుక స్వరపేటిక క్రింద ఉండే
![](http://178.128.105.246/cars-http-upload.wikimedia.org/wikipedia/commons/thumb/d/d4/Illu01_head_neck.jpg/220px-Illu01_head_neck.jpg)
![](http://178.128.105.246/cars-http-upload.wikimedia.org/wikipedia/commons/thumb/8/81/Tonsils_diagram.jpg/220px-Tonsils_diagram.jpg)
ముద్రికా మృదులాస్థి ( క్రైకాయిడ్ కార్టిలేజ్ ) వెనుక, ముద్రికా గళ నియంత్రణ కండరం (క్రైకో ఫెరింజియల్ స్ఫిన్టరు) క్రింద అన్ననాళంగా కొనసాగుతుంది. ముద్రికా మృదులాస్థి ఉంగరపుటాకారములో ఉంటుంది[5].
భాషా విశేషాలు
మార్చుతెలుగు భాషలో గొంతు పదానికి వివిధ ప్రయోగాలున్నాయి. గొంతు లేదా గొంతుక నామవాచకంగా The throat. కంఠము. The voice, a tone కంఠధ్వని అని అర్ధము. ఉదా: గొంతు పట్టినది I am chocked, i.e., I do not know what to say. నా గొంతు రాసినది I am hoarse. వాని గొంతు కమ్మినది he is hoarse. గొంతుకపోక or గొంతునబడి n. The apple of the throat. గొంతు కూర్చుండు v. n. అనగా To squat down on one's heels. గొంతుకోత n. A cut throat business. A brawl, a quarrel. గొంతెమగోరుచెట్టు n. A plant, Paederia foetida. సారణి, లంజె. సవరము. గొంతెమ్మ ఒక గ్రామదేవత. మహాభారతంలో కుంతి తెలుగులో గొంతిగా మార్పు చెందింది. గొంతి తన తొలి సంతానం కర్ణుడిని పాండవులతో యుద్ధము చేయక వారిత��� సహా బ్రతికియుండాలని కోరింది. మిగిలిన పాండవులను చంపనని, కాని తాను, అర్జునుడులలో ఒకరే ఆమెకు మిగులుతారని, చివరకు గొంతికి మిగిలేది ఐదుగురు కుమారులు మాత్రమే అని కర్ణుడు గొంతికి (కుంతికి) మాట యిస్తాడు. కుంతి కోర్కెలు గొంతెమ్మ కోరికలు నానుడిగా ప్రసిద్ధికెక్కాయి[6] n. Whimsical speculations, castles in the air. కోరదగని కోరికల, వెర్రిమూచనలు.
మూలాలు
మార్చు- ↑ "https://www.cancer.gov/publications/dictionaries/cancer-terms/def/pharynx". www.cancer.gov (in ఇంగ్లీష్). 2011-02-02. Retrieved 2024-07-11.
{{cite web}}
: External link in
(help)|title=
- ↑ "Pharynx Anatomy: Overview, Gross Anatomy, Microscopic Anatomy". 2021-04-16.
{{cite journal}}
: Cite journal requires|journal=
(help) - ↑ 3.0 3.1 3.2 "Pharynx - an overview | ScienceDirect Topics". www.sciencedirect.com. Retrieved 2024-07-11.
- ↑ 4.0 4.1 cancer, Canadian Cancer Society / Société canadienne du. "The pharynx". Canadian Cancer Society (in ఇంగ్లీష్). Retrieved 2024-07-11.
- ↑ Spencer, Tom. "Cricoid cartilage | Radiology Reference Article | Radiopaedia.org". Radiopaedia (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2024-07-11.
- ↑ Admin (2024-05-22). "మీరేమీ "గొంతెమ్మ కోరికలు" కోరడం లేదు కదా!". andhrapradesh.thefederal.com. Retrieved 2024-07-11.