Please enable javascript.

Gold Rate : మళ్లీ పెరుగుతున్న బంగారం ధరలు.. వరుసగా రెండో రోజూ పైపైకి.. ఈరోజు తులం రేటు ఎంతంటే..?

Authored by భరత్ కలకొండ | The Economic Times Telugu | Updated: 29 Jun 2024, 10:21 am

బంగారం ధరులు మళ్లీ పెరుగుతున్నాయి. వరుసగా రెండో రోజూ పైపైకి చేరాయి. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ లో 22 క్యారట్ మరియు 24 క్యారట్ బంగారం ధరలతో పాటు వెండి ధరలు (Gold Silver Price Today) ఎలా ఉన్నాయో ఈ కింది కథనంలో తెలుసుకోండి.

 
gold

Representative Image


పసిడి వరుసగా రెండో రోజూ పెరిగాయి. ఈరోజు (29-06-2024) తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో ఒక గ్రాము 22 క్యారట్ల బంగారం ధర (Gold Price Today) రూ. 6,625 గానూ, 8 గ్రాముల బంగారం ధర రూ. 53,000 గానూ ఉంది. అలాగే 10 గ్రాముల (తులం) బంగారం ధర రూ. 66,250 గానూ ఉంది. నిన్నటి ధరతో పోల్చితే ఇవాళ 10 గ్రాముల 22 క్యారట్ల పసిడి ధర రూ. 100 పెరిగింది.
ఇక 24 క్యారెట్ల బంగారం విషయానికి వస్తే హైదరాబాద్ లో ఒక గ్రాము ధర రూ. 7,228 గానూ. 8 గ్రాముల ధర రూ. 57,824 గానూ ఉంది. 10 గ్రాముల ధర రూ. 72,280 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే ఈరోజు 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 120 పెరిగింది.

మరోవైపు వెండి ధరలు గత మూడు రోజులుగా స్థిరంగా ఉన్నాయి. తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో ఒక గ్రాము వెండి ధర (Silver Price Today) రూ. 94.50 గానూ , 8 గ్రాముల వెండి ధర రూ. 756 గానూ ఉంది. అలాగే 10 గ్రాముల వెండి ధర రూ. 945 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే ఇవాళ కిలో వెండి ధర ధరలో ఎలాంటి మార్పు లేకుండా రూ. 94,500 గా ఉంది.

విజయవాడలో ఈరోజు బంగారం ధర..
ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడలో ఒక గ్రాము 22 క్యారట్ల బంగారం ధర (Today Gold Price) రూ. 6,625 గానూ, 8 గ్రాముల బంగారం ధర రూ. 53,000 గానూ ఉంది. అలాగే 10 గ్రాముల (తులం) బంగారం ధర రూ. 66,250 గానూ ఉంది. నిన్నటి ధరతో పోల్చితే ఇవాళ 10 గ్రాముల 22 క్యారట్ల పసిడి ధర రూ. 100 పెరిగింది.

ఇక 24 క్యారెట్ల బంగారం విషయానికి వస్తే, విజయవాడలో ఒక గ్రాము ధర రూ. 7,228 గానూ. 8 గ్రాముల ధర రూ. 57,824 గానూ ఉంది. 10 గ్రాముల ధర రూ. 72,280 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే ఈరోజు 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 120 పెరిగింది.

విజయవాడలో వెండి విషయానికి వస్తే ఒక గ్రాము వెండి ధర (Today Silver Price) రూ. 94.50 గానూ , 8 గ్రాముల వెండి ధర రూ. 756 గానూ ఉంది. అలాగే 10 గ్రాముల వెండి ధర రూ. 945 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే ఇవాళ కిలో వెండి ధర ధరలో ఎలాంటి మార్పు లేకుండా రూ. 94,500 గా ఉంది.

Business News వెబ్‌సైట్ అయిన ది ఎకనామిక్ టైమ్స్ తెలుగులో Share Market, స్టాక్ మార్కెట్‌కి సంబంధించిన లేటెస్ట్, బ్రేకింగ్ న్యూస్ చదవండి.
భరత్ కలకొండ గురించి
భరత్ కలకొండ Digital Content Producer
భరత్ కలకొండ ఎకానమిక్స్ టైమ్స్ తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ బిజినెస్‌కు సంబంధించిన తాజా వార్తలు, స్టోరీలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో నాలుగున్నర సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ రంగాలకు సంబంధించిన వార్తలు రాశారు.Read More