Please enable javascript.

Stanley Lifestyles IPO Listing : లిస్టింగ్ రోజే 35 శాతం లాభాలు ఇచ్చిన ఐపీఓ.. రూ. 499 వద్ద లిస్ట్ అయిన స్టాన్లీ లైఫ్ స్టయిల్స్ షేర్లు..

Authored by భరత్ కలకొండ | The Economic Times Telugu | Updated: 28 Jun 2024, 3:03 pm

స్టాన్లీ లైఫ్ స్టయిల్స్ ఐపీఓ షేర్లు స్టాక్ మార్కెట్లో 35 శాతం ప్రీమియంతో లిస్ట్ అయ్యాయి. మార్కెట్ అంచనాల కంటే కాస్త తక్కువ ధర వద్ద ప్రారంభమయ్యాయి. అయితే లాంగ్ టర్మ్ లో ఇంకా మంచి లాభాలు అందించే అవకాశం ఉందని అనలిస్టులు చెబుతున్నారు. దీనికి సంబంధించిన వివరాలు కింది కథనంలో..

 
Stanley Lifestyles IPO

Representative Image


ఐపీఓ ద్వారా స్టాక్ మార్కెట్లో మరో కంపెనీ అరంగేట్రం చేసింది. లగ్జరీ ఫర్నిచర్ బ్రాండ్ సాన్లీ లైఫ్ స్టయిల్స్ ఐపీఓ షేర్లు బీఎస్ఈలో 35.23 శాతం ప్రీమియంతో రూ. 499 వద్ద లిస్ట్ అయ్యాయి. ఇష్యూ ధర రూ. 369 గా ఉంది. ఇన్వెస్టర్లకు మొదటి రోజు 35 శాతం రిటర్నులు వచ్చాయి. ఎన్ఎస్ఈలో అయితే 34.13 శాతం ప్రీమియంతో రూ. 495.95 వద్ద షేర్లు లిస్ట్ అయ్యాయి. స్లాన్లీ లైఫ్ స్టయిల్స్ కు ఇది మంచి ఆరంభం అనే చెప్పవచ్చు.
అయితే లిస్టింగ్ ముందు అన్ లిస్టెడ్ మార్కెట్లో షేర్లు రూ. 179 ప్రీమియంతో ట్రేడ్ అయ్యాయి. ఈ లెక్కన రూ. 518 వద్ద స్టాక్ మార్కెట్లో లిస్ట్ కావాల్సి ఉంది. ఇంతకంటే కొంచెం తక్కువ ధర రూ. 499 వద్ద అరంగేట్రం చేశాయి. ఐపీఓ ద్వారా వచ్చే ఆదాయాన్ని కొత్త స్టోర్ ప్రారంభించడం కోసం ఉపయోగించనున్నట్లు కంపెనీ తెలిపింది. ప్రస్తుతమున్న స్టోర్లను పునరుద్ధరించడంతో పాటు ఇతర కార్పొరేట్ అవసరాల కోసం నిధులను వెచ్చించనున్నట్లు తెలిపింది.

సూపర్ ప్రీమియం మరియూ లగ్జరీ ఫర్నిచర్ బ్రాండ్ గా స్టాన్లీ లైఫ్ స్టయిల్స్ కు భారత్ లో మంచి గుర్తింపు ఉంది. తయారీ కేంద్రంతో పాటు రిటైల్ కార్యకాలపాలు కూడా నిర్వహిస్తోంది. రానున్న రోజుల్లో వ్యాపారాన్ని మరింత విస్తరించాలని ప్రణాళికలు సిద్దం చేసుకుంది. ఆర్థకంగా బలంగా ఉండటం, వ్యూహాత్మక భాగస్యామ్యాలతో రాబోయే రోజుల్లో ఈ కంపెనీ మంచి వృద్ది నమోదు చేసే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్లు మంచి ఫలితాలు పొందే అవకాశం ఉందని పేర్కొన్నారు.

సోఫాలు, కుర్చీలు, కిచెన్ కేబినెట్స్, బెడ్స్, పరుపులు, దిండ్లు సహా ఇతర హోమ్ సొల్యూషన్స్ ను స్టాన్లీ లైఫ్ స్టయిల్స్ అందిస్తుంది. లగ్జరీ ప్రొడక్టుగా మార్కెట్లో గుర్తింపు పొందింది. భారత్ లో లగ్జరీ ఫర్నీచర్ విభాగంలో ఈ కంపెనీ లీడింగ్ లో ఉన్నట్లు అనలిస్టులు చెబుతున్నారు. లగ్జరీ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ ప్రభావం దీనిపై పరోక్షంగా ఉంటుందని పేర్కొన్నారు. కొత్తగా ఇల్లు కొనుగోలు చేసే వారు లగ్జరీ ఫర్నిచర్ కూడా కొనగోలు చేస్తారని, ఫలితంగా రాబోయే రోజుల్లో మంచి వృద్ధి నమోదు చేయవచ్చని తెలిపారు.

2023 ఆర్థిక సంవత్సరంలో కార్యకలాపాల ద్వారా కంపెనీ రెవెన్యూ రూ. 69.51 కోట్లుగా నమోదైంది. అంతకుముందు సంవత���సరం ఇది రూ. 67.44 కోట్లుగానే ఉంది. పన్ను తర్వాత లాభం నాలుగు రెట్లు పెరిగి రూ. 4.12 కోట్ల నుంచి రూ. 15.80 కోట్లకు చేరింది.

Business News వెబ్‌సైట్ అయిన ది ఎకనామిక్ టైమ్స్ తెలుగులో Share Market, స్టాక్ మార్కెట్‌కి సంబంధించిన లేటెస్ట్, బ్రేకింగ్ న్యూస్ చదవండి.
భరత్ కలకొండ గురించి
భరత్ కలకొండ Digital Content Producer
భరత్ కలకొండ ఎకానమిక్స్ టైమ్స్ తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ బిజినెస్‌కు సంబంధించిన తాజా వార్తలు, స్టోరీలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో నాలుగున్నర సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ రంగాలకు సంబంధించిన వార్తలు రాశారు.Read More