Please enable javascript.

Jio Vs Airtel : టారిఫ్ లు పెంచినా జియోనే చౌక.. ఎయిర్టెల్ ప్లాన్ల కంటే చాలా తక్కువ ధర..

Authored by భరత్ కలకొండ | The Economic Times Telugu | Updated: 29 Jun 2024, 4:50 pm

దేశంలో నంబర్ 1 , నెంబర్ 2 టెలికాం కంపెనీలు అయిన జియో, ఎయిర్టెల్ రీఛార్జ్ ప్లాన్ల ధరలను భారీగా పెంచిన విషయం తెలిసిందే. అయితే టారిఫ్ ల పెంపు తర్వాత కూడా జియో ప్లాన్ల ధరలు ఎయిర్టెల్ కంటే చాలా తక్కువ ధరకు లభిస్తున్నాయి. వీటికి సంబంధించిన పూర్తి వివరాలు కింది కథనంలో తెలుసుకోండి.

 
Jio Vs Airtel

Representative Image


జియో, ఎయిర్టెల్ కస్టమర్లకు షాకిస్తూ టారిఫ్ లు భారీగా పెంచిన విషయం తెలిసిందే. మొదట జియో 10 నుంచి 21 శాతం వరకు ప్రీపెయిడ్, పోస్ట్ పెయిడ్ రీఛార్జ్ ప్లాన్ల ధరలను పెంచింది. ఆ తర్వాత ఎయిర్టెల్ కూడా 10 నుంచి 25 శాతం వరకు ధరలను పెంచింది. ఈ రేట్లు జూలై మొదటి వారం నుంచి అమల్లోకి రానున్నాయి. అయితే ఛార్జీలు పెంచిన తర్వాత కూడా జియో ప్లాన్లే చౌక ధరకు లభిస్తున్నాయి. ఎయిర్టెల్ తో పోల్చితే టారిఫ్ లు తక్కువగా ఉన్నాయి. ఇందుకు సంబంధించిన వివరాలు ఇప్పుడు చూద్దాం.
నెలవారీ రీఛార్జ్ ప్లాన్లు ఇలా..

  • జియో రోజుకు 1 జీబీ డేటా, అన్ లిమిటెడ్ ప్లాన్ ధర రూ. 249 గా ఉంది. అదే ఎయిర్టెల్ లో అయితే రూ. 299 గా ఉంది. జియో యూజర్లు 20 శాతం తక్కువ ధరకే ప్లాన్ పొంది రూ. 50 ఆదా చేసుకోవచ్చు.

  • రోజుకు 1.5 జీబీ డేటా, అన్ లిమిటెడ్ కాలింగ్ ప్లాన్ జియోలో రూ. 299 గా ఉంది. ఎయిర్టెల్ అయితే రూ. 349 గా ఉంది. జియో యూజర్లు 17 శాతం తక్కువ ధరతో రూ. 50 ఆదా చేసుకోవచ్చు.

  • రోజుకు 2 జీబీ డేటా, అన్ లిమిటెడ్ కాలింగ్ ప్లాన్ జియో రూ. 349 కి అందిస్తుండగా, ఎయిర్టెల్ లో ఇదే ప్లాన్ ధర రూ. 379 గా ఉంది. జియో యూజర్లు 9 శాతం తక్కువ ధరతో రూ. 30 ఆదా చేసుకోవచ్చు.

  • రోజుకు 2.5 జీబీ డేటా అన్ లిమిటెడ్ ప్లాన్ ధర జియోలో రూ. 399 గా ఉండగా, ఎయిర్టెల్ లో రూ. 409 గా ఉంది. జియో యూజర్లు 3 శాతం తక్కువ ధరతో రూ. 10 ఆదా చేసుకోవచ్చు.

రెండు నెలల ప్లాన్లు

  • జియో రోజుకు 1.5 జీబీ డేటా, అన్ లిమిటెడ్ కాలింగ్ ను రూ. 579 కి అందిస్తుండగా, ఎయిర్టెల్ కూడా రూ. 579 కే అందిస్తోంది. ఈ ప్లాన్ లో ఎలాంటి వ్యత్యాసం లేదు.

  • జియో రోజుకు 2 జీబీ డేటా, అన్ లిమిటెడ్ కాలింగ్ ను రూ. 629 గా అందిస్తుండగా, ఎయిర్టెల్ రూ. 649 అందిస్తోంది. జియో కంటే 3 శాతం లేదా రూ. 20 ఎక్కువగా ఉంది.


మూడు నెలల ప్లాన్

  • 6 జీబీ డెటా, అన్ లిమిటెడ్ కాలింగ్ మూడు నెలల ప్లాన్ ధర జియోలో రూ. 479 గా ఉంది. అదే ఎయిర్టెల్ లో అయితే 6 శాతం లేదా రూ. 30 ఎక్కువ ధరతో రూ. 509 గా ఉంది.

  • రోజుకు 1.5 జీబీ డేటా, అన్ లిమిటెడ్ కాలింగ్ ప్లాన్ ధర జియోలో రూ. 799 గా ఉంది. అదే ఎయిర్టెల్ అయితే 8 శాతం లేదా రూ. 60 ఎక్కువ ధరతో రూ. 859 గాఉంది.

  • రోజుకు 2 జీబీ డేటా, అన్ లిమిటెడ్ కాలింగ్ ప్లాన్ ధర జియోలో రూ. 859 గా ఉంది. అదే ఎయిర్టెల్ లో అయితే 14 శాతం లేదా రూ. 120 ఎక్కువ ధరతో రూ. 979 గా ఉంది.

12 నెలల ప్లాన్

  • 24 జీబీ డేటా, అన్ల లిమిటెడ్ కాలింగ్ ఏడాది వరకు పొందేందుకు జియో రూ. 1,899 ప్లాన్ ను ఆఫర్ చేస్తోంది. అదే ఎయిర్టెల్ అయితే 5 శాతం లేదా రూ. 100 ఎక్కువ ధరతో రూ. 1,999 కు ఈ ప్లాన్ ను అందిస్తోంది.

  • రోజుకు 2.5 జీబీ డేటా, అన్ లిమిటెడ్ కాలింగ్ 365 రోజుల ���ాటు పొందాలంటే జియో యూజర్లు రూ. 3,599 తో రీఛార్జ్ చేసుకోవాలి. అయితే ఎయిర్టెల్ కూడా ఇదే ధరకు ఈ ప్లాన్ ను అందిస్తోంది. ఇంకా అదనంగా రోజుకు జియో కంటే 0.5 జీబీ డేటా అదనంగా అందిస్తోంది. ఈ ఒక్క ప్లాన్ జియో కంటే ఎయిర్టెల్ లో బెటర్ గా ఉంది.

భరత్ కలకొండ గురించి
భరత్ కలకొండ Digital Content Producer
భరత్ కలకొండ ఎకానమిక్స్ టైమ్స్ తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ బిజినెస్‌కు సంబంధించిన తాజా వార్తలు, స్టోరీలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో నాలుగున్నర సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ రంగాలకు సంబంధించిన వార్తలు రాశారు.Read More