Please enable javascript.

NTR Bharosa : పింఛనుదారులకు గుడ్ న్యూస్.. ఒకటో తేదీన ఇంటి వద్దకే డబ్బులు.. వృద్ధులు, వితంతువులకు రూ. 7,000..

Authored by భరత్ కలకొండ | The Economic Times Telugu | Updated: 29 Jun 2024, 6:54 pm

పింఛనుదారులకు ఒకటో తేదీని ఇంటి వద్దకే వెళ్లి డబ్బులు అందించించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏరాట్లు చేసింది. పెంచిన పింఛన్ ను ఏప్రిల్ నుంచే అమలు చేయడంతో వృద్ధులు, వితంతువులు రూ. 7 వేల పింఛన్ అందుకోనున్నారు. దివ్యాంగులు రూ. 6,000 అందుకోనున్నారు. తాడేపల్లిలో సీఎం చంద్రబాబు స్వయంగా పింఛన్లు పంపిణీ చేయనున్నారు.

 
NTR Bharosa

Representative Image


ఆంధ్రప్రదేశ్ లో అధికారం చేపట్టిన టీడీపీ ప్రభుత్వం పింఛన్ల పంపిణీకి అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఒకటో తేదీనే లబ్ధిదారులందరికీ పింఛను డబ్బులు అందజేయాలని ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేయంది. సచివాలయ సిబ్బంది స్వయంగా లబ్ధిదారుల ఇండ్లకు వెళ్లి పింఛన్లను పంపిణీ చేయనున్నారు. రాష్ట్రంలో మొత్తం 65 లక్షల 18 వేల మందికిపైగా పింఛను లబ్ధిదారులు ఉన్నారు. వీరిలో 90 శాతం మందికి ఒకటో తేదీనే పింఛను అందించాలని అధికారులు సిబ్బందిని ఆదేశించారు. ఒకటో తేదీ పింఛను అందని వారికి 2వ తేదీన కచ్చితంగా అందజేయాలని స్పష్టం చేశారు.
పెరిగిన పింఛన్లు..
తాము అధికారంలోకి పింఛన్లను రూ. 3,000 నుంచి రూ. 4,000 కు పెంచుతామని టీడీపీ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. అలాగే దివ్యాంగులకు రూ. 3,000 నుంచి రూ. 6,000 చేస్తామని చెప్పింది. అధికారంలోకి రాగానే ఇచ్చిన మాట నిలబెట్టుకుంది. పింఛన్లు పెంచుతూ ఆదేశాలు జారీ చేసింది. పెంచిన పింఛన్లను ఏప్రిల్ నుంచే అమలు చేస్తామని కూడా హామీ ఇచ్చింది. దీంతో జూలై 1వ తేదీన వృద్ధులు, వితంతవులు రూ. 4 వేల పింఛనుకు అదనంగా, ఏప్రిల్, మే, జూన్ నెలలకు గానూ రూ. 1,000 చొప్పన మొత్తం రూ. 7,000 పింఛను పొందనున్నారు. దివ్యాంగులకు పెరిగిన పింఛన్ రూ. 6,000 అందజేయనున్నారు.

గత ప్రభుత్వ వైఎస్సార్ పెన్షన్ కానుక పేరుతో సామాజిక భద్రత పింఛను పథకాన్ని అమలు చేసింది. ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం ఈ పథకాన్ని ఎన్టీఆర్ భరోసా పేరుతో అందించనుంది. 2014-19లో అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇదే పేరుతో ఈ పథకాన్ని అమలు చేసింది.

ఆంధ్రప్రదేశ్ లో మొత్తం 28 కేటగిరిల్లో పింఛన్లు అందిస్తోంది ప్రభుత్వం. వృద్ధులు, వింతతువులు, చేనేత వృత్తుల వారు, కల్లుగీత కార్మికులు, డప్పు కళాకారులు, హెచ్ఐపీ బాధితులు, ట్రాన్స్ జెండర్లకు గతంలో ఉన్న రూ. 3 వేల పింఛన్ కు గానూ జూలై 1 నుంచి 4 వేలు పొందనున్నారు. వీరికి ఎరియర్స్ తో కలిపి జులై లో రూ. 7,000 అందుతాయి. ఆగస్టు నుంచి ప్రతి నెల రూ. 4,000 అందుతాయి.

  • దివ్యాంగులకు పింఛన్ రూ. 3,000 నుంచి రూ. 6,000 కు పెరగనుంది.

  • కిడ్నీ వ్యాధిగ్రస్తులు, తలసేమియా బాధితులు గత ప్రభుత్వంలో రూ. 5 వేల పింఛన్ అందుకోగా, జూలై 1 నుంచి ఇది రూ. 10 వేలకు పెరగనుంది.

  • పక్షవాతం, యాక్సిడెంటలో ప్రమాదానికి గురై కండరాలు పని చేయని వారికి రూ. 5 వేలుగా ఉన్న పింఛన్ జూలై 1 నుంచి రూ. 15,000 కు పెరగనుంది.

  • ఇలా మొత్తం 28 కేటగిరీల్లో 65 లక్షల మందికిపైగా పింఛన్లు పొందుతున్నారు.
సీఎం చేతుల మీదుగా..
జూలై 1న పింఛన్ల పంపిణీని స్వయంగా సీఎం చంద్రబాబు చేపట్టనున్నారు. తాడేపల్లి మండలం పెనుమాకలో ఇంటింటికి వెళ్లి పింఛన్లు పంపిణీ చేయనున్నారు. సీఎం ఇంటింటికి వెళ్లి పింఛన్లను పంపిణీ చేయడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం.

భరత్ కలకొండ గురించి
భరత్ కలకొండ Digital Content Producer
భరత్ కలకొండ ఎకానమిక్స్ టైమ్స్ తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ బిజినెస్‌కు సంబంధించిన తాజా వార్తలు, స్టోరీలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో నాలుగున్నర సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ రంగాలకు సంబంధించిన వార్తలు రాశారు.Read More