Please enable javascript.

Budget 2024 : మిడిల్ క్లాస్ కు రిలీఫ్.. కొత్త పన్ను విధానంలో స్టాండర్ట్ డిడక్షన్ ను పెంచనున్న కేంద్రం..!

Authored by భరత్ కలకొండ | The Economic Times Telugu | Updated: 24 Jun 2024, 6:17 pm

బడ్జెట్ లో పన్ను చెల్లింపుదారులకు కాస్త ఉరటిచ్చే నిర్ణయం ఉండనున్నట్లు తెలుస్తోంది. కొత్త పన్ను విధానంలో స్టాండర్డ్ డిడక్షన్ పరిమితిని పెంచాలని కేంద్రం భావిస్తున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కింది కథనంలో తెలుసుకోండి.

 
budget income tax

Representative Image


కేంద్రం త్వరలో ప్రవేశ పెట్టబోయే బడ్జెట్ లో పన్ను చెల్లింపుదారులకు కాస్త ఉపశమనం లభించనున్నట్లు తెలుస్తోంది. కొత్త పన్ను విధానంలో స్టాండర్డ్ డిడక్షన్ పరిమితిని పెంచాలని ఆర్థిక శాఖ భావిస్తున్నట్లు సమాచారం. అయితే పాత పన్ను విధానంలో మాత్రం ఎలాంటి మార్పులు ఉండవని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ఎన్డీఏ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చాక ప్రవేశ పెట్టబోయే మొదటి బడ్జెట్ లో కీలక మార్పులేవి ఉండే అవకాశం లేదని నిపుణులు అంచనా వేస్తున్నారు. క్యాపిటల్ గెయిన్స్ మెకానిజానికి మార్పులు చేయాలని ఆదాయ పన్ను శాఖ చాలా కాలంగా కోరుతోంది. అయితే మొదటి బడ్జెట్ లో దీనికి సంబంధించి ఎలాంటి నిర్ణయం ఉండబోదని తెలుస్తోంది. ప్రస్తుత సిస్టంనే యథావిధంగా కొనసాగించాలని, ఎలాంటి మార్పులు చేయకూడాదని కేంద్ర ఆర్థిక శాఖ భావిస్తున్నట్లు సమచారం.
బడ్జెట్ కు సంబంధించిన చర్చలు ఇప్పుడిప్పుడే ప్రారంభమయ్యాయి. కేంద్రం ప్రభుత్వానికి చెంది అన్ని శాఖల అధికారులతో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారమన్ చర్చలు జరుపుతున్నారు. అన్ని సమస్యలపై దృష్టి సారిస్తున్నారు. చివరగా పీఎంఓ నుంచి ఫీడ్ బ్యాక్ అనంతరం తుది నిర్ణయం తీసుకుంటారు.

కాగా కేంద్ర ప్రభుత్వంలోని అన్ని శాఖలు మిడిల్ క్లాస్ కు పన్ను ప్రయోజనం కల్పించేందుకు సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. మోదీ ప్రభుత్వానికి మిడిల్ క్లాస్ చాలా మద్ధతుగా ఉంది. అయితే పన్ను చెల్లింపు విషయంలో మాత్రం ప్రస్తుతం ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. ధరలు పెరగడం, ఆస్పత్రి, ఎడ్యుకేషన్ ఖర్చులు వివరీతంగా ఉండటంతో పన్ను మినహాయింపు కావాలని మిడిల్ క్లాస్ ప్రజలు చాలా కాలంగా కోరుకుంటున్నారు.

2023 బడ్జెట్ లో పన్ను చెల్లింపుదారులకు స్టాండర్డ్ డిడక్షన్ ను తీసుకొచ్చింది కేంద్రం. దీని ద్వారా ట్యాక్స్ పేయర్స్ ఎలాంటి ఆధారాలు సమర్పించాల్సిన అవసరం లేకుండా రూ. 50 వేల వరకు పన్ను మినహాయింపు పొందవచ్చు. అయితే ఇది కొత్త పన్ను విధానానికి మాత్రమే వర్తిస్తుంది. దీని ప్రకారం రూ. 7 లక్షల లోపు ఆదాయం గల వారు ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవరం లేదు. అలాగే రూ. 50 వేలు స్టాండర్డ్ డిడక్షన్ ఉంటుంది కాబట్టి రూ. 7.5 లక్షల వరకు ఆదాయం గలవారికి పన్ను భారం నుంచి ఉపశమనం లభించింది.

అయితే పాత పన్ను విధానంలో రూ. 3 లక్షల ఆదాయం దాటితే రూ. 5 శాతం పన్ను చెల్లించాలి. కానీ వీరికి చాలా పన్ను మినహాయింపులు ఉన్నాయి. కాబట్టి పన్ను భారం తక్కువే పడుతోంది. కానీ కొత్త పన్ను విధానంలో మాత్రం ఎలాంటి మినహాయింపులు లేవు. కేవలం స్టాండర్ట్ డిడక్షన్ ప్రయోజనం మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో మిడ���ల్ క్లాస్ ప్రజలు పన్ను భారం నుంచి బయటపడేందుకు పన్ను పరిమితి పెంచాలని లేదా, స్టాండర్డ్ డిడక్షన్ పెంచాలని కోరుకుంటున్నారు.

ప్రస్తుతం డీఫాల్ట్ గా అందరికీ కొత్త పన్న విధానమే వర్తిస్తుంది. అయితే ట్యాక్స్ పేయర్స్ ఎక్కువ మినహాయింపులు పొందాలనుకుంటే పాత పన్ను విధానాన్ని ఎంపిక చేసుకునే అవకాశం ఉంది. కానీ అందరు కొత్త పన్ను విధానాన్నే ఎంపిక చేసుకునేలా ప్రోత్సహించాలంటే స్టండర్డ్ డిడక్షన్ ను పెంచాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇలా అయితే అందరూ కొత్త పన్ను విధానానికే మొగ్గు చూపుతారని చెబుతున్నారు. మరి బడ్జెట్ లో స్టాండర్డ్ డిడక్షన్ ను కేంద్రం ఏమేర పెంచుతుందో చూడాలి.

Personal Finance, ఆదాయపు పన్నుకు సంబంధించి మరింత సమాచారంతో పాటు లేటెస్ట్ అప్‌డేట్స్ పొందడం కోసం Business News వెబ్‌సైట్ అయిన ది ఎకనామిక్ టైమ్స్ తెలుగును సందర్శించండి.
భరత్ కలకొండ గురించి
భరత్ కలకొండ Digital Content Producer
భరత్ కలకొండ ఎకానమిక్స్ టైమ్స్ తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ బిజినెస్‌కు సంబంధించిన తాజా వార్తలు, స్టోరీలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో నాలుగున్నర సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ రంగాలకు సంబంధించిన వార్తలు రాశారు.Read More