Please enable javascript.

ITR Filing : ఆదాయంతో సంబంధం లేదు.. ఇలాంటి సందర్బాల్లో కచ్చితంగా ఐటీఆర్ ఫైల్ చేయాలి..

Authored by భరత్ కలకొండ | The Economic Times Telugu | Updated: 27 Jun 2024, 3:15 pm

సాధారణంగా ఆదాయపు పన్ను పరిమితిలోకి వచ్చే వారే ఐటీఆర్ ఫైల్ చేస్తారు. కానీ కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ఆదాయంతో సంబంధం లేకుండా కచ్చితంగా ఐటీఆర్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు కింది కథనంలో తెలుసుకోండి.

 
ITR

Representative Image


ఆదాయపు పన్ను పరిమితిలోకి వచ్చే ప్రతి ఒక్కరు ఇన్ కమ్ ట్యాక్స్ రిటన్స్ ఫైల్ చేయడం తప్పనిసరి. అయితే పన్ను పరిమితిలోకి రాకపోయినా కొన్ని సందర్భాల్లో భారీ లావాదేవీలు జరిపినప్పుడు కచ్చితంగా ఐటీఆర్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. లేదంటే ఐటీ శాఖ నుంచి నోటీసులు పొందాల్సి వస్తుంది. లేదా పెనాల్టీ కూడా కట్టాల్సి రావచ్చు. మరి ఆ లావాదేవీలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
డిపాజిట్లు రూ. 50 లక్షలు దాటితే
బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్లు ఒక్క సంవత్సరంలో రూ. 50 లక్షలు దాటినప్పుడు కచ్చితంగా ఐటీఆర్ ఫైల్ చేయాలి. అన్ని బ్యాంకు అకౌంట్లలో డిపాడిట్లు కలిపితే రూ. 50 లక్షలు దాటకూడదు.

రూ. 10 లక్షలు దాటితే
వృత్తి ద్వారా వచ్చే ఆదాయం సంవత్సరానికి రూ. 10 లక్షలు దాటినా కూడా కచ్చితంగా ఐటీఆర్ ఫైల్ చేయాల్సి ఉంటుంది.

కరెంటు బిల్లు రూ. 1 లక్ష దాటితే..
ఇంటి కరెంటు బిల్లు సంవత్సరంలో రూ. లక్ష దాటినా కూడా కచ్చితంగా ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేయాలి.

టీడీఎస్, టీసీఎస్ రూ. 25 వేలు దాటితే
టీడీఎస్ లేదా టీసీఎస్ రూ. 25 వేలు దాటినా కూడా ఐటీఆర్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. అయితే సీనియర్ సిటిజన్లకు ఈ పరిమితి రూ. 50 వేల వరకు ఉంటుంది.

విదేశీ ఆస్తులు
విదేశాల్లో ఆస్తుల ద్వారా ఆదాయం పొందే వారు కూడా కచ్చితంగా ఐటీఆర్ ఫైల్ చేయాల్సిందే.

విదేశీ ప్రయాణాలు
విదేశాల్లో పర్యటించి ఒక సంవత్సరంలో రూ. 2 లక్షలకు పైగా ఖర్చు చేసినా కూడా కచ్చితంగా ఐటీఆర్ ఫైల్ చేయాల్సి ఉంటుంది.

  • ఐటీఆర్ ఫైల్ చేయాల్సి ఉన్నా చేయకపోతే ఐటీ శాఖ కఠిన చర్యలు తీసుకుంటుంది.

  • గడువు తేదీ లోగా ఐటీఆర్ ఫైల్ చేయకపోతే ప్రతి నెల 1 శాతం వడ్డీని రుసుంగా చెల్లించాల్సి ఉంటుంది.
  • డ్యూ తేదీలోగా ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేయకపోతే రూ. 5 లక్షలకు పైగా ఆదాయం ఉన్నవారు రూ. 5 వేలు పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది.

కాబట్టి ఈ విషయాల గురించి తెలుసుకుని జూలై 31 డెడ్ లైన్ లోగా ఐటీఆర్ ఫైల్ చేయండి. లేదంటో జరిమానాతో పాటు వడ్డీ కూడా చెల్లించాల్సి ఉంటుంది. పాత విధానంలో అయితే ఆదాయ రూ. 5 లక్షలు దాటిన వారు కొత్త పన్ను విధానంలో అయితే రూ. 7 లక్షలకుపైగా ఆదాయం ఉన్న వారు తప్పనిసరిగా ఐటీఆర్ పైల్ చేసి పన్ను కట్టాల్సి ఉంటుంది. పన్ను ఎగవేత దారులపై ఐటీ శాఖ కఠిన చర్యలు తీసుకుంటుంది. భారీ జరిమానాతో పాటు ఒక్కోసారి జైలు శిక్ష కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబ్టటి ఆదాయపు పన్ను విషయంలో అజాగ్రత్తగా ఉండకూడదు.

Personal Finance, ఆదాయపు పన్నుకు సంబంధించి మరింత సమాచారంతో పాటు లేటెస్ట్ అప్‌డేట్స్ పొందడం కోసం Business News వెబ్‌సైట్ అయిన ది ఎకనామిక్ టైమ్స్ తెలుగును సందర్శించండి.
భరత్ కలకొండ గురించి
భరత్ కలకొండ Digital Content Producer
భరత్ కలకొండ ఎకానమిక్స్ టైమ్స్ తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ బిజినెస్‌కు సంబంధించిన తాజా వార్తలు, స్టోరీలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో నాలుగున్నర సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ రంగాలకు సంబంధించిన వార్తలు రాశారు.Read More