Please enable javascript.

Highest Interest Rate : దేశంలోని అన్ని బ్యాంకుల కంటే అధిక వడ్డీని అందిస్తున్న ఏకైక ప్రైవేట్ బ్యాంకు..ఎంత వడ్డీనో తెలుసా?

Authored by Rupesh | The Economic Times Telugu | Updated: 26 Jun 2024, 1:20 pm

రూ. 5 కోట్ల లోపు విలువ కలిగిన ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచుతున్నట్లు ప్రముఖ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులలో ఒకటి అయిన నార్త్ ఈస్ట్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు ప్రకటించింది.

 
Highest interest rates
Representative Image
దేశంలోని ప్రముఖ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులలో ఒకటి అయిన నార్త్ ఈస్ట్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు, రూ. 5 కోట్ల లోపు విలువ కలిగిన ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచుతున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం నార్త్ ఈస్ట్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు 7 రోజుల నుంచి 10 సంవత్సరాల కాలపరిమితి కలిగిన ఫిక్స్డ్ డిపాజిట్లపై సాధారణ ఖాతాదారులకు 3.25 శాతం నుంచి 9.25 శాతం వరకు వడ్డీ రేటును, అలాగే సీనియర్ సిటిజన్లకు 3.75 శాతం నుంచి 9.75 శాతం వరకు వడ్డీ రేట్లను అందిస్తుంది.
అలాగే బ్యాంకు 546 నుంచి 1111 రోజుల కాలపరిమితి కలిగిన ఫిక్స్డ్ డిపాజిట్ పై సాధారణ ఖాతాదారులకు అత్యధికంగా 9.25 శాతం వడ్డీ రేటును, అలాగే సీనియర్ సిటిజన్లకు అత్యధికంగా 9.75 శాతం వడ్డీ రేటును అందిస్తుంది. ఇక సాధారణ ఖాతాదారులతో పోల్చితే సీనియర్ సిటిజన్లకు బ్యాంకు 50 బేసిస్ పాయింట్ల అదనపు వడ్డీ రేటును అందిస్తుంది.

ఫిక్స్డ్ డిపాజిట్లపై నార్త్ ఈస్ట్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు అందిస్తున్న వడ్డీ రేట్లను పరిశీలిస్తే..

* 7 రోజుల నుంచి 14 రోజుల కాలపరిమితి కలిగిన ఫిక్స్డ్ డిపాజిట్లపై బ్యాంకు ఇప్పుడు 3.25 శాతం వడ్డీ రేటును అందిస్తుంది.

* 15 రోజుల నుంచి 29 రోజుల కాలపరిమితి కలిగిన ఫిక్స్డ్ డిపాజిట్లపై బ్యాంకు ఇప్పుడు 3.75 శాతం వడ్డీ రేటును అందిస్తుంది.

* 30 రోజుల నుంచి 45 రోజుల కాలపరిమితి కలిగిన ఫిక్స్డ్ డిపాజిట్లపై బ్యాంకు ఇప్పుడు 4.25 శాతం వడ్డీ రేటును అందిస్తుంది.

* 46 రోజుల నుంచి 90 రోజుల కాలపరిమితి కలిగిన ఫిక్స్డ్ డిపాజిట్లపై బ్యాంకు ఇప్పుడు 4.75 శాతం వడ్డీ రేటును అందిస్తుంది.

* 91 రోజుల నుంచి 180 రోజుల కాలపరిమితి కలిగిన ఫిక్స్డ్ డిపాజిట్లపై బ్యాంకు ఇప్పుడు 6.25 శాతం వడ్డీ రేటును అందిస్తుంది.

* 181 రోజుల నుంచి 365 రోజుల కాలపరిమితి కలిగిన ఫిక్స్డ్ డిపాజిట్లపై బ్యాంకు ఇప్పుడు 7.25 శాతం వడ్డీ రేటును అందిస్తుంది.

* 366 రోజుల నుంచి 545 రోజుల కాలపరిమితి కలిగిన ఫిక్స్డ్ డిపాజిట్లపై బ్యాంకు ఇప్పుడు 9.00 శాతం వడ్డీ రేటును అందిస్తుంది.

* 546 రోజుల నుంచి 1111 రోజుల కాలపరిమితి కలిగిన ఫిక్స్డ్ డిపాజిట్లపై బ్యాంకు ఇప్పుడు 9.25 శాతం వడ్డీ రేటును అందిస్తుంది.

* 1112 రోజుల నుంచి 1825 రోజుల కాలపరిమితి కలిగిన ఫిక్స్డ్ డిపాజిట్లపై బ్యాంకు ఇప్పుడు 8.25 శాతం వడ్డీ రేటును అందిస్తుంది.

* 1826 రోజుల నుంచి 3650 రోజుల కాలపరిమితి కలిగిన ఫిక్స్డ్ డిపాజిట్లపై బ్యాంకు ఇప్పుడు 6.50 శాతం వడ్డీ రేటును అందిస్తుంది.

Personal Finance, ఆదాయపు పన్నుకు సంబంధించి మరింత సమాచారంతో పాటు లేటెస్ట్ అప్‌డేట్స్ పొందడం కోసం Business News వెబ్‌సైట్ అయిన ది ఎకనామిక్ టైమ్స్ తెలుగును సందర్శించండి.
Rupesh గురించి
Rupesh Senior Digital Content Producer