ద్రవ్యరాశి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ద్రవ్యరాశి
2 కి.గ్రా. (4.4 పౌ.) ద్రవ్యరాశి గల తూనిక రాయి
Common symbols
m
SI ప్రమాణంకి.గ్రా
Extensive?yes
Conserved?yes

ద్రవ్యరాశి అనేది ఒక వస్తువు యొక్క సహజ ధర్మము, భౌతిక రాశి. పరమాణువు, కణ భౌతికశాస్త్రం కనుగొనే దాకా దీనిని ఒక వస్తువులో పదార్థం ఎంత పరిమాణం ఉందో చెప్పడానికి కొలమానంగా వాడే సాంప్రదాయ భౌతిక శాస్త్ర భావన.

సాధారణ వాడుకలో ఒక వస్తువు ద్రవ్యరాశినే దాని బరువుగా పేర్కొంటుంటారు. కానీ "బరువు" లేదా "భారము" అనేది ఒక వస్తువుపై పనిచేసే గురుత్వాకర్షణ బలానికి సమానము. కాబట్టి భౌతిక శాస్త్ర పరంగా బరువు లేదా భారం అనేది ద్రవ్యరాశికి భిన్నమైనది. శుద్ధ గతిక శాస్త్రంలో ద్రవ్యరాశి విలువలు కీలక పాత్ర పోషిస్తాయి. ద్రవ్యరాశిని గ్రాములు లేదా పౌండులలో కొలుస్తారు. వస్తు ధర్మాలను భౌతిక శాస్త్ర పరంగా వివరించటానికి ద్రవ్యరాశి ఒక ప్రాథమిక కొలతగా వినియోగించబడుతుంది.

మూలాలు

[మార్చు]