మానవ హక్కులు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఐక్యరాజ్యసమితి సార్వత్రిక మానవ హక్కుల ప్రకటన (యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ - యూడీహెచ్‌ఆర్)'ను ఐక్యరాజ్యసమితి 1948 డిసెంబరు 10 ప్రకటించింది. ప్రతి సంవత్సరం డిసెంబరు 10 అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవంగా జరుపుకొంటారు.[1][2]

మానవ హక్కుల చరిత్ర

[మార్చు]

ప్రపంచంలోని అన్ని ప్రాంతాలకు చెందిన, చట్టపరమైన అంశాల్లో, సాంస్కృతిక వ్యవహారాల్లో వేర్వేరు నేపథ్యాలున్న ప్రతినిధులు కలసి రెండు సంవత్సరాలు ఈ మానవ హక్కులు రూపొందించారు. ఈ ముసాయిదా కమిటీకి అమెరికా మాజీ అధ్యక్షుడు ఫ్రాంక్లిన్ డి.రూజ్వెల్ట్ భార్య ఎలీనర్ రూజ్వెల్ట్ సారథ్యం వహించారు. ప్రపంచంలో అన్ని దేశాల ప్రజలందరికీ ఆదర్శనీయమైన ఒక ఉమ్మడి ప��రమాణంగా 1948 డిసెంబరు 10న ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభ తీర్మానాన్ని ఆమోదించింది.అన్ని దేశాలు పరిరక్షించుకోవాల్సిన ప్రాథమిక మానవ హక్కులను తొలిసారిగా ఈ పత్రం నిర్దేశించారు.[3]

పీఠికలో ఉన్న ఉద్దేశం

[మార్చు]
  • ప్రపంచంలో ఉన్న మానవులు అంతా ఒక్కటే ప్రతి ఒక్కరికీ సహజసిద్ధమైన గౌరవం, సమానమైన, శాశ్వతమైన హక్కులు ఉన్నాయి.

మానవ హక్కులు

[మార్చు]
Declaration of the Rights of Man and of the Citizen approved by the National Assembly of France, 26 August 1789
  • జాతి, వర్ణ, లింగ, కుల, మత, రాజకీయ ఏవిధమైన వివక్షకు గురికాకుండా ఉండే హక్కు.
  • చిత్రహింసలు, క్రూరత్వం నుండి రక్షణ పొందే హక్కు
  • వెట్టిచాకిరీ, బానిసత్వం నుండి రక్షణ పొందే హక్కు
  • సరైన కారణం లేకుండా ఏ మానవున్ని నిర్బంధించబడకుండా ఉండేహక్కు.
  • స్వేచ్ఛగా స్వదేశంలో లేదా విదేశాల్లో పర్యటించే హక్కు.[1]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 ఆంధ్రజ్యోతి (10 December 2016). "మీకు మానవ హక్కుల గురించి తెలుసా?". Archived from the original on 19 April 2019. Retrieved 21 February 2020.
  2. సాక్షి, వేదిక-అభిప్రాయం (10 December 2014). "అంతర్జాతీయ హక్కుల దినోత్సవం". జాన్ బర్నబాస్ చిమ్మె. Archived from the original on 19 April 2019. Retrieved 21 February 2020.
  3. లింగుట్ల, రవిశంకర్ (2019-12-10). "హ్యూమన్ రైట్స్ డే: మనిషిగా మీ హక్కులు మీకు తెలుసా..." BBC News తెలుగు. Retrieved 2020-02-21.

వెలుపలి లంకెలు

[మార్చు]